గ్రీన్ ఛాలెంజ్ స్వీకరించిన యాంకర్ శ్యామల

ఎంపీ సంతోష్ కుమార్ చేపట్టిన గ్రీన్ ఛాలెంజ్ కు విశేష స్పందన లభిస్తోంది. అందులో భాగంగా .. ప్రముఖ యాంకర్ శ్యామల గ్రీన్ ఛాలెంజ్ స్వీకరించి, ఎస్ఆర్ నగర్ లో తన నివాసంలో మొక్కలు నాటారు. అనంతరం యాంకర్లు ఝాన్సీ, రవి, వర్శిణిలను నామినేట్ చేశారు. ఎంపీ సంతోష్ కుమార్ ప్రారంభించిన ఈ ఉద్యమం ఎంతో బాగుందని శ్యామల మెచ్చుకున్నారు. ప్రతి ఒక్కరూ మొక్కలు నాటడంతో పాటు వాటిని సంరక్షించాలని కోరారు.