అందరి సమన్వయంతో పల్లె ప్రగతి విజయవంతం చేయాలని అనుకున్నాం కానీ 11వ స్థానంలో ఉన్నాం..వచ్చే పల్లె ప్రగతిలో రాష్ట్రంలో మొదటి స్థానానికి మన జిల్లా వచ్చేలా అందరం సమిష్టి కృషి చేయాలని రాష్ట్ర గిరిజన సంక్షేమ, స్త్రీ-శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ కోరారు. పంచాయతీ రాజ్ చట్టంపై అవగాహన కల్పించేందుకు మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో నందన గార్డెన్స్ లో నేడు ఏర్పాటు చేసిన పంచాయతీ రాజ్ సమ్మేళనానికి మంత్రి సత్యవతి రాథోడ్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు.
మన జిల్లా రాష్ట్రానికి రోల్ మోడల్ అయ్యేలా పనిచేద్దాం..